నీ కూతురు బెడ్ రూంకు పోలీసుల‌ను పంపిస్తే…

Read Time: 0 minutes

కూల్ అండ్ క్లీన్ పొలిటీష‌న్ గా పేరుగాంచిన కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి ఒక్క‌సారిగా బ‌ర్న్ అయ్యారు. కొడంగ‌ల్ లో రేవంత్ అరెస్ట్ పై స్పందిస్తూ… ఎన్న‌డూ లేని విధంగా కేసీఆర్ పై మాట‌ల దాడికి దిగారు.

పోలీసులు దొంగ‌ల వ‌లే… డోర్లు ప‌గ‌ల‌గొట్టి, బెడ్ రూం వ‌ర‌కు వెళ్లారు. రేవంత్ భార్య నా ఇంట్లో పెరిగింది. నా కూతురు. నా కూతురు బెడ్ రూంకు పోలీసుల‌ను పంపావ్… రేపు కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌చ్చాక నీ కూతురు ఇంటికి పోలీసుల‌ను పంపి, బెడ్ రూంను ప‌గ‌ల‌గొడితే ఒప్పుకుంటావా అంటూ నిప్పులు చెరిగారు. కొడంగల్ లో కాంగ్రెస్ మ‌నుషులే లేకుండా అరెస్ట్ చేయ‌టం ఎంత‌వ‌ర‌కు స‌బ‌బ‌ని, కొస్గీలో కేసీఆర్ స‌భ పెడితే… 18కి.మీ దూరంలో ఉండే కొడంగ‌ల్ లో రేవంత్ ను అరెస్ట్ చేయ‌టం ఎందుక‌ని ప్ర‌శ్నించారు.

కేసీఆర్ కొడంగ‌ల్ మీటింగ్ ఆయ‌న చెంచాల‌తో పెట్టుకుంటున్నారు త‌ప్పా, అది పబ్లిక్ మీటింగ్ కాద‌ని… ఇలాంటి దొర పోక‌డ సీఎంను ఎప్పుడు చూడ‌లేద‌ని మండిప‌డ్డారు. నాలుగున్న‌రేండ్లుగా ఫాంహౌజ్ లో ప్ర‌శాంతంగా ఉన్న సీఎం కేసీఆర్ కు ఇప్పుడు ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంద‌ని, అందుకే సంగారెడ్డిలో జ‌గ్గారెడ్డిని, గ‌జ్వేల్ లో ప్ర‌తాప్ రెడ్డి, కొడంగ‌ల్ లో రేవంత్ రెడ్డిని అణ‌చివేయాల‌ని చూస్తున్నార‌ని విమ‌ర్శించారు. త‌న రాజ‌కీయ జీవితంలో ఇలాంటి ముఖ్య‌మంత్రిని ఎప్పుడూ చూడ‌లేద‌ని… మ‌రోసారి ఈ కేసీఆర్ సీఎం కాకుండా చూడాల్సిన స‌మ‌య‌మిదేనంటూ ఆవేధ‌న వ్య‌క్తం చేశారు. కేసీఆర్… ప్ర‌చారం సంద‌ర్భంగా… కొడంగ‌ల్ లో ఉద‌యం 3 గంట‌ల నుండే ఉద్రిక్త ప‌రిస్థితులు మొద‌ల‌య్యాయి. ఓ వైపు రేవంత్ ను ముట్ట‌డించి… ఆయ‌న బెడ్ రూం డోర్ల‌ను ప‌గ‌ల‌గొట్టి రేవంత్ ను అరెస్ట్ చేయ‌గా… ఆయ‌న కుటుంబ స‌బ్యుల‌ను ఇంటి నుండి బ‌య‌ట‌కు రాకుండా చూశారు. దీంతో ఆయ‌న భార్య తీవ్ర ఆవేధ‌న వ్య‌క్తం చేయ‌గా… కాంగ్రెస్ సీనీయ‌ర్ నేత‌లు డీకే శివ‌కుమార్, గులాంన‌బీ ఆజాద్ లు ఫోన్ లో రేవంత్ భార్య‌కు దైర్యం చెప్పారు.

అయితే…  రేవంత్ భార్య గీతారెడ్డి… జైపాల్ రెడ్డి తమ్ముడు కూతురని కొంత‌మందికే తెలుసు. ఆయ‌న కూడా ఎప్పుడూ బ‌య‌ట పెట్ట‌రు. రేవంత్ రెడ్డి… మా పెద్ద మామ అని అప్పుడ‌ప్పుడు చెప్పినా, కుటుంబంలో ఉన్న త‌గాదాల కార‌ణంగా… మా కూతురు, మా తమ్ముడు కూతురు అని జైపాల్ రెడ్డి సంబోధించాడే త‌ప్పా, మా అల్లుడు అంటూ సంబోధించ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*