పెద్ద‌కొడుకును కౌగిలించుకున్న తెలంగాణ‌

Read Time: 0 minutes

తెలంగాణ త‌న పెద్ద‌కొడుకును కౌగిలించుకుంది. క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో తెలంగాణ ఓట‌ర్లు కేసీఆర్ కు ప‌ట్టం క‌ట్టారు. గ‌తంలో ఎన్న‌డూ లేనివిధంగా టీఆర్ఎస్ అబ్య‌ర్థుల‌కు అపూర్వ మెజారిటీ క‌ట్ట‌బెట్టారు. కేసీఆర్ నాకు పెన్ష‌న్ ఇస్తున్న‌డు… కేసీఆర్ నా పెద్ద‌కొడుకు అనే నినాదం ప్ర‌జ‌ల్లో బ‌లంగా ఉన్న‌ట్లు స్ప‌ష్టంగా క‌న‌ప‌డుతోంది.

ఏ ఇంట్లో అవ్వ‌ను ప‌ల‌క‌రించినా… కేసీఆర్ నా పెద్ద కొడుకు అనే అన్నారు. కేసీఆర్ పెన్ష‌న్ ఇచ్చిండు, కాంగ్రెస్ ఇస్తానంటోంది. కానీ కేసీఆర్ ఇచ్చాక ఇస్తా అన్న‌ది. అంత‌కు ముందు వాళ్లేందుకు ఇవ్వ‌లేదు. మ‌ళ్లీ వ‌చ్చాక ఇవ్వ‌క‌పోతే ఎట్లా అన్న ఆందోళ‌న‌తో పెన్ష‌న‌ర్స్ అంతా మూకుమ్మ‌డిగా కేసీఆర్ కు జై కొట్టారు. ఇంటికి రెండు పెన్ష‌న్లు ఇస్తామ‌న్న కాంగ్ర‌సె్ కూట‌మి వైపు మొగ్గుచూపలేదు. పైగా కంటిచూపు ప‌థ‌కం సూప‌ర్ గా వ‌ర్క‌వుట్ అయింది టీఆరెఎస్ పార్టీకి. కంటి ప‌రీక్ష‌లు చేయించుకొని, అద్దాలు తీసుకున్న వారిలో మెజారిటీ జ‌నం 60 ఏండ్లు  పైబ‌డిన వృద్దులే. ఓ వైపు పెన్ష‌న్లు, మ‌రోవైపు కంటిచూపు ప‌థ‌కం టీర్ఎస్ కు బూస్ట్ నిచ్చిన‌ట్లు క‌న‌ప‌డుతోంది. ఈ రెండు ప‌థ‌కాల‌కు తోడు, ఎంతోకొంత భూమి ఉన్న వాళ్ల‌కు రైతుబందు రావ‌టం కూడా క‌లిసివ‌చ్చిన‌ట్లు ఫ‌లితాలను విశ్లేషిస్తే అర్థ‌మ‌వుతోంది. ప్ర‌ధానంగా ఈ మూడు ప‌థ‌కాలే కేసీఆర్ ను తెలంగాణ త‌ల్లుల‌కు పెద్ద కొడుకును చేసిన‌ట్లు క‌న‌ప‌డుతోంది.

కొన్ని ఏండ్లుగా మా పిల్ల‌లు ప‌ట్టించుకోవ‌టం లేదు, మందుల‌కు… ఆసుప‌త్రి ఖ‌ర్చుల‌కు డ‌బ్బులివ్వ‌టం లేద‌ని ఎంతో మంది వృద్దులు వాపోయేవారు. అలాంటి వారికి వ‌రంలా కేసీఆర్ దొరికాడ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అందుకే కేసీఆర్ ను కాద‌ని కూట‌మికి ఓటేస్తే, వారు పెన్ష‌న్లు స‌రిగ్గా ఇవ్వ‌క‌పోతే… ఉన్న‌ది పోత‌ది, అప్పుడు మ‌ళ్లీ మొద‌టికే వ‌స్తుంది… అన్న భ‌యంతో వృద్దులు టీఆర్ఎస్ కు ఓటేసిన‌ట్లు స్ప‌ష్టంగా క‌న‌ప‌డుతోంది. నిరుద్యోగుల ఓట్లు కేసీఆర్ కు వ్య‌తిరేకంగా ప‌డినా,  ఆ ప్ర‌భావం క‌న‌ప‌డ‌కుండా బ‌లంగా ప‌నిచేసిన ఫాక్ట‌ర్స్ లో ఇదే ముఖ్య‌మైన‌ది అన్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*