పోలింగ్ కు ముందు రోజే పార్టీ మారనున్న ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు..?

Read Time: 0 minutes

అదిగో ఇదిగో…. వచ్చేస్తున్నారు, జుంప్ అవుతున్నారు అనుకుంటూ, ఎప్పటికప్పుడు వాయిదా పడుతోన్న ఇద్దరు టీఆరెస్ ఎంపీల ముహూర్తం ఫిక్స్ అయిందా అంటే అవుననే తెలుస్తోంది. సరిగ్గా పోలింగ్ కు ముందు రోజు…. టీఆరెస్ ఎంపిలను చేర్చుకోవడం ద్వారా, టీఆరెస్ కు షాకివ్వటంతో పాటు ఆ ప్రభావం పోలింగ్ పై ఉండేలా వ్యూహం సిద్ధం చేసింది కాంగ్రెస్ పార్టీ.

ఇప్పటికే ఎంపీ కొండా చేరిక తో చేవెళ్ళ, పరిగి, తాండూరు నియోజకవర్గాల్లో అనూహ్యంగా పుంజుకున్న కాంగ్రెస్, ఈ సారి ఉత్తర తెలంగాణ పై ఫోకస్ చేసింది. ఉత్తరంలో బలమైన టీఆరెస్ ను ఎదుర్కోవడం అంత సులభం కాదని గ్రహించి…. ఎంపిలను తీసుకోవటం ద్వారా టీఆరెస్ ను పోలింగ్ ముందే దిక్కుతోచని స్థితిలో కి నెట్టేయాలని ముఖ్య నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఆదిలాబాద్ ఎంపీ నగేష్ పార్టీ మారె అవకాశం ఉందని తెలుస్తోంది. ఎంపీ నగేష్ కు మంచి పేరుతో పాటు ఉద్యమ తెలంగాణ నాయకుడిగా గుర్తింపు ఉంది. నగేష్ చేరిక ద్వారా కనీసం మూడు, నాలుగు స్థానాల్లో అయిన ఆ ప్రభావం ఉండబోతుంది. నగేష్ కూడా టీఆరెస్ నాయకత్వం పై అసంతృప్తి తో ఉన్నారు. ఆయన ఈ సారి అసెంబ్లీ కి పోటీ చేయాలని భావించిన, కేసీఆర్ నిరాకరించారు. ఇటు మహా కూటమి గానే ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న కాంగ్రెస్….. ఆదిలాబాద్ లో గెలుపు హిజి కానుంది. గతం లో ఎంపీ గా ఉన్న రమేశ్ రాథోడ్ ఈ సారి కాంగ్రెస్ నుండి అసెంబ్లీ బరిలో ఉండటం కూడా నగేష్ కాంగ్రెస్ లో చేరికకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది.

ఇటు నగేష్ తో పాటు మరో ఎంపీ సీతారాం నాయక్ పేరు కూడా బలంగానే వినపడుతోంది. ఇప్పటికే ఆయన ఖండించిన స్థానికం గా మాత్రం ఆయన పార్టీ మారుతున్నారన్న వార్త బలంగానే వినిపిస్తోంది. అక్కడ కూడా మహబూబ్ బాద్ ఎంపీ గా ఉండి, కేంద్ర మంత్రిగా కూడా చేసిన బలరాం నాయక్ అసెంబ్లీ బరిలో ఉన్నారు. అందుకే సీతారాం నాయక్ అక్కడ పార్టీ మరబోతున్నారన్న అంశం తెర పైకి వస్తోంది. సీతారాం నాయక్ పేరు ఎంత గట్టిగా వినపడుతుందో…. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ పెట్టు కూడా అంతే బలంగా తెరపైకి వస్తోంది. బీబీ పాటిల్ తో ఇప్పటికె కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం టచ్ లో ఉందని…. సమయం కోసం  వేచి చూస్తున్నాం అంతే అని గాంధీ భవన్ వర్గాలంటున్నాయి. బీబీ పాటిల్ కు ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న జహీరాబాద్ పార్లమెంట్ కె మరోసారి పోటీ చేయించబోతున్నారు.

దింతో కాంగ్రెస్ వర్గాల్లో కొత్త జోష్ నిండుతుండగా, టీఆరెస్ వర్గాలు ఇప్పటికే రంగం లోకి దిగినట్లు తెలుస్తోంది. టీఆరెస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు ను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*