ప‌థ‌కాల‌తో పాటే పైస‌లు… డ‌బ్బు ర‌వాణాకు టీఆరెఎస్ కొత్త మార్గాలు

Read Time: 0 minutes

దొరుకుతున్న డబ్బంతా… ప్ర‌తిప‌క్షాల‌ది, మ‌హ‌కూట‌మిదే అంటూ టీఆర్ఎస్ ఓవైపు ప్ర‌క‌టిస్తున్నాయి. విచ్చ‌ల‌విడిగా నోట్ల క‌ట్ట‌లు బ‌ట‌య‌ప‌డుతూనే ఉన్నాయి. దొరికిన డ‌బ్బంతా… ప్ర‌తిప‌క్షాల‌దే అయితే, గ్రౌండ్ లెవ‌ల్ లో టీఆరెఎస్ పంచుతున్న డ‌బ్బు ఎలా వ‌స్తోంది, ముందే డంప్ చేసి పెట్టుకున్నారా… లేక ఏదైనా మార్గంలో టీఆర్ఎస్ డ‌బ్బు త‌ర‌లిస్తోందా….

డ‌బ్బు, మ‌ద్యం ఏరులై పారుతోంది. చ‌రిత్ర‌లో లేనివిధంగా 110 కోట్ల పై చిలుకు డ‌బ్బు ప‌ట్టుబ‌డింది అంటే, దొర‌క‌ని డ‌బ్బు ఎంత ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు. కానీ టీఆర్ఎస్ డ‌బ్బు ఎలా త‌ర‌లివెళ్తోంది అన్న దానిపై కొత్త క‌థ‌నాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. ప‌థ‌కాల‌తో పాటే పైస‌లు కూడా ర‌వ‌ణా అవుతున్నాయ‌ని విమ‌ర్శ‌లు వ‌స్తోన్నాయి. ఎమ‌ర్జెన్సీ కోసం వాడే 108,104 వాహ‌నాల‌ను సాధార‌ణంగా త‌నిఖీ చేయ‌రు. అధికార యంత్రాంగం ఎలాగు టీఆర్ఎస్ పార్టీ నేత‌ల చేతుల్లో ఉంది, పైగా… కొద్ది మంది క‌నుస‌న్నల్లో న‌డిచే అధికార యాంత్రాగానికి సూచ‌న‌లు చేస్తూ… ముందే ప్లాన్ ప్లిపేర్ చేసుకొని, అక్క‌డ పోలీస్ యాంత్రాంగం తనిఖీలు చేప‌ట్ట‌ర‌ని విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతోన్నాయి.

కేవ‌లం 108,104 వాహ‌నాలే కాదు… డ్వాక్రా సంఘాలకు ఆన్ లైన్ లోనే మ‌నీ ట్రాన్స‌ఫ‌ర్ చేస్తున్నార‌ని, ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే… అప్ప‌టికే లోకల్ లీడ‌ర్ల‌కు చేరిన మొత్తాన్ని ఓట‌ర్ స్లిప్ ల‌తో పంచుతున్న‌ట్లు తెలుస్తోంది. అందుకే… ఆ పార్టీ తాజా మాజీ నేత‌లు చెప్పిన‌ట్లు వంద‌ల కోట్లు ఎమ్మెల్యే అబ్య‌ర్థుల‌కు పంచినా, మ‌ద్యం ఏరులై పారుతున్నా… ఎక్క‌డా ప‌ట్టుబ‌డ‌టం లేదు. ఇక మీడియా వాహ‌నాలు, స్థానికంగా టీఆర్ఎస్ నేత‌ల చొర‌వ‌తో పొస్టింగ్ తీసుకుని… ఎన్నికల అధికారులుగా ఉన్న వాహ‌నాల‌ను టీఆర్ఎస్ వాడుకుంటుంది అని కూట‌మి నేత‌లు ఆరోపిస్తున్నారు. ఇక కాంగ్రెస్ సీనీయ‌ర్ నేత‌, వీహెచ్ ఓ అడుగు ముందుకేసి… టీఆర్ఎస్ కు స‌హ‌క‌రించిటం మానుకోవ‌టం మంచిదంటూ ఏకంగా డీజీపీకే సూచించ‌టం గ‌మ‌నార్హం.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*