ముద్దుగ‌మ్మ చెప్పేది నిజ‌మేనా…

Read Time: 0 minutes

హాట్ యాంక‌ర్, న‌టీ ర‌ష్మీ మ‌రోసారి వివాదాల‌కు కేంద్ర‌బిందువైంది. డ‌బ్బులొస్తు, మంచి ప‌ని ఏదైనా చేస్తానంటూ బ‌హిరంగంగానే ప్ర‌క‌టించిన రష్మీ, ఆమెకు ఉన్న క్రేజ్ తో అనేక ప్రైవేటు ప్రోగ్రాంల‌కు కూడా వెళ్తోంది. అయితే… తిరుప‌తిలో ఈరోజు జ‌ర‌గాల్సిన ఓ ఈవెంట్ ఇప్పుడు వివాదానికి దారితీసింది.

ర‌ష్మీ ఒక్క‌తే కాదు, ప‌లువురు స్టార్ హీరోయిన్స్ కు ఉన్న క్రేజ్ ను దృష్టిలోపెట్టుకొని కాస్త ఖ‌ర్చ‌యినా స‌రే… వాళ్ల‌ను త‌మ షాప్ ఓపెనింగ్స్ కు, ప‌లు ఈవెంట్ల‌కు ఆహ్వ‌నిస్తారు. కొన్ని చిన్న చిన్న సంస్థ‌ల‌యితే… వారు రాకున్నా, వారి అనుమ‌తి తీసుకోకుండానే హోర్డింగ్స్ ఏర్పాటు చేసి, అక్క‌డి ప్ర‌జ‌ల అట్రాక్ష‌న్ వ‌చ్చేలా తాప‌త్ర‌య‌ప‌డుతారు. అయితే ఇలాంటి ఘ‌ట‌నే ఇప్పుడు ర‌ష్మీని మ‌రోసారి వార్త‌ల్లోకి లాగుతోంది. ఇటీవ‌ల  తిరుప‌తి న‌గ‌రంలో ఓ హోర్డింగ్ ఏర్పాటు చేశారు. ఆదివారం అంటే నేడు జ‌రిగే ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా స్టార్ యాంక‌ర్ ర‌ష్మీ వస్తుంద‌ని దాని మెసెజ్. అయితే… ఆ విష‌యం రష్మీకి తెలియ‌టంతో… ఆమె ట్విట్ట‌ర్ లో స్పందించారు. ఆ ఈవెంట్ కు నాకు ఏం సంబంధం లేద‌ని, నేను దానికి అటెండ్ కావ‌టం లేద‌ని ట్వీట్ చేసింది. అయితే ఆ ప్రోగ్రాం నిర్వ‌హ‌కుడు స్పందిస్తూ… ర‌ష్మీ మాట మారుస్తుంద‌ని, ఇప్ప‌టికే అడ్వాన్స్ కు కూడా పంపించాం, ర‌ష్మీ మేనేజ‌ర్ కు డబ్బు ఇచ్చిన‌ట్లు ఆధారాలున్నాయంటూ రీ ట్వీట్ చేయ‌టంతో… విష‌యం పెద్ద‌దైంది. అవ‌స‌ర‌మ‌యితే లీగ‌ల్ యాక్ష‌న్ కూడా తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. దాంతో ర‌ష్మీ కూడా మ‌రింత ఘాటుగా స్పందిస్తూ… నిజనిజాల‌న్నీ తేలుతాయి. మీరేదైనా చేసుకోండి.

లీగల్ గా వెళ్లాల‌నుకుంటే వెళ్ళోచ్చు అని తేగేసి చెప్ప‌య‌టంతో, ఈరోజు ఆమె అటెండ్ అవుతుందా…?  కాక‌పోతే నిర్వ‌హ‌కులు లీగ‌ల్ యాక్ష‌న్ తీసుకుంటారా…. లేక ఇంత‌టితో ఇష్యూని వ‌దిలేస్తారో చూడాలి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*