మ‌హ‌కూట‌మి వెన్నుముఖ‌గా ఉన్న‌ది ఈ నేత‌లే….

Read Time: 1 minutes

రాష్ట్రంలో టీఆర్ఎస్ ను గ‌ద్దె దించేందుకు ఒక్క‌టైన మ‌హ‌కూట‌మి ప‌క్షాల‌ను ఏక‌తాటిపై ముందుకు న‌డిపిస్తోంది ఎవ‌రు…? ఎప్ప‌టిక‌ప్పుడు గేమ్ ప్లాన్స్ మారుస్తూ… కేసీఆర్ కు ప్ర‌తివ్యూహాల‌ను సిద్ధం చేస్తోంది ఎవ‌రూ…?  కేంద్ర, రాష్ట్రాల్లో ట్ర‌బుల్ షూట‌ర్స్ ఇప్పుడు తెలంగాణ‌లో మొహ‌రించారా….?

ఇలాంటి ప్ర‌శ్న‌ల‌కు అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. పార్టీలో వారి వారి స్థాయిని బ‌ట్టి కీల‌క నేత‌లు వారు. వారికి ప‌ని అప్ప‌జెప్పి… నిశ్చితంగా ఉండొచ్చ‌న్న న‌మ్మ‌కం వ్య‌క్తం చేసే అంతా పేరు సంపాదించిన నేత‌లు. వారే… మాజీ కేంద్ర‌మంత్రి, మాజీ ముఖ్య‌మంత్రి గులాం న‌బీ ఆజాద్ కాగా, మ‌రో నేత క‌ర్ణాట‌క ట్ర‌బుల్ షూట‌ర్… బీజేపీకి కొర‌క‌రాని కొయ్య, క‌ర్ణాట‌క మంత్రి డీకే శివ‌కుమార్.

ఈ ఇద్ద‌రు నేత‌లు… నామినేష‌న్ల చివ‌రి రోజుల నుండి తెలంగాణ‌లోనే మ‌కాం వేశారు. ఎప్ప‌టికప్పుడు ప‌రిస్థితిని అంచ‌నా వేయ‌టం, కేంద్ర నాయ‌క‌త్వానికి స‌మాచారం ఇస్తూనే… రాష్ట్ర కాంగ్రెస్ నేత‌ల‌తో పాటు, కూట‌మి నేత‌ల‌ను స‌మ‌న్వ‌య ప‌రిచే బాద్య‌త కూడా మోస్తున్నారు. గులాం న‌బీ అజాద్ కు అయితే తెలంగాణ‌పై మంచి ప‌ట్టుంది. 2004లో టీఆర్ఎస్– కాంగ్రెస్ ల పొత్తుకు ఆజాదే కీల‌కం. 2004, 2009లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావ‌టంలో ఆజాద్ పాత్ర క్రీయాశీల‌కం. దాంతో ఆయ‌న్ను గ్రేట‌ర్ లో ముస్లీం సామాజిక వ‌ర్గం ఓట్లున్న చోట ప్ర‌చారంలోనూ వాడుకుంటూనే, తెర వెనుక మంత్రంగంలో నిమ‌గ్నం చేసింది కాంగ్రెస్. ఇట డీకే శివ‌కుమార్ ప‌రిస్థితి దాదాపు అంతే. ఆయ‌న అసంతృప్తుల‌ను బుజ్జ‌గించేందుకు వ‌చ్చి… తెలంగాణ‌లోనే ఉండిపోయారు. ఏ నేత‌కు ఇప్పుడు ఏ అవ‌స‌రం వ‌చ్చినా అన్నీ ఆయ‌నే చూస్తున్నారు. ఇటు ఏపీ సీఎం చంద్రబాబును స‌మ‌న్వ‌యం చేసుకుంటూనే, అబ్య‌ర్థులకు అన్నీ ర‌కాలుగా స‌హ‌య స‌హ‌కారాలు అందిస్తున్నారు. పోలింగ్ ముందు రోజు ఎలాంటి వ్యూహలు సిద్దం చేయాలి, పోల్ మ్యానేజ్ మెంట్ ప‌రిస్థితి ఎంట‌న్న కీల‌క విష‌యాల్లో ఇప్పుడు డీకే శివ‌కుమారే కీల‌కం.

దీంతో… మ‌హ‌కూట‌మి త‌రుపున ఏ ప‌ని కావాలన్నా… ఈ ఇద్ద‌రు నేత‌లే చూసుకుంటూ, కేసీఆర్ కు వ్య‌తిరేక వ్యూహాల‌ను సిద్దం చేయ‌టంలోనూ, అమ‌లు ప‌ర్చ‌టంలోనూ క్రీయాశీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు గెలుపోట‌ముల విష‌యంలో స‌ర్వేల‌ను తెప్పించుకుంటూ, అక్క‌డి స్థానిక నేత‌ల‌తో ట‌చ్ లో ఉంటున్నారు. తాజాగా రేవంత్ అరెస్ట్ ఎపిసోడ్ లోనూ… ఆ అంశంపై రాష్ట్ర వ్యాప్త నిర‌స‌న‌ల‌కు పిలుపునిచ్చి, కార్య‌క‌ర్త‌ల‌ను మ‌రింత యాక్టివ్ చేసే కార్య‌క్ర‌మం చేయ‌టంతో పాటు, ఇటు ఈసీస‌, అటు కోర్టు తలుపులు త‌ట్టారు. ఇలా బ‌హుముఖంగా ఈ ఇద్ద‌రు నేత‌లు మ‌హ‌కూట‌మికి వెన్నుముఖ‌గా, క్రీయాశీల‌కంగా ప‌నిచేస్తున్నారు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*