రాష్ట్ర ఎన్నికల అధికారి నామికే వా స్తేనే నా…? అందుకే అలా జరిగిందా….?

Read Time: 0 minutes

రాష్ట్ర ఎన్నికల అధికారి అంటే… ఎన్నికల ప్రక్రియ మొదలు ఆయనే సూపర్ బాస్. సీఎం పెన్ కు ఎంత పవర్ ఉంటదో… ఎన్నికల ప్రక్రియ వరకు ఆయనకూ అంత అధికారం వుంటుంది. 2009 ఎన్నికల్లో నాటి ఎన్నికల అధికారి…. మోస్ట్ పవర్ ఫుల్ సీఎంగా పేరుతెచ్చుకున్న వైఎస్ ను సైతం ముప్పు తిప్పలు పెట్టాడు. వైఎస్ ఒత్తిడికి ఏమాత్రం లొంగకుండా నిక్కచ్చిగా వ్యవహరించారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు కనపడటం లేదు.

ముఖ్యంగా… రేవంత్ ఇష్యూ, ఆ తదనంతరం కోర్ట్ చివాట్ల విషయంలో ప్రస్తుత రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్ పై పలు అనుమానాలు, అసమర్థత, అన్న విమర్శలు బయటకొస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘము రియాక్ట్ ఐయ్యేంత వరకు రాష్ట్ర ఎన్నికల అధికారి పెద్దగా పట్టించుకోలేదు. కాంగ్రెస్ రేవంత్ అరెస్ట్ ఇష్యూ ను సీరియస్ గా తీసుకొని, ఢిల్లీలో ఫిర్యాదు చేస్తే గాని…. విడిచిపెట్టలేదు. అంతకు ముందే రజత్ కుమార్ ను కలిసిన ఫలితం లేకపోయింది. అంటే ఏవైనా ఒత్తిడి ఉండేనా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు మహా కూటమి నేతలు.

ఇవన్నీ పక్కన పెడితే…. రాష్ట్రంలో సర్వేల ప్రకటన పై నిషేధం ఉంది. రోజుకో సర్వే, పూటకో సంస్థ పేరుతో ఇటు సోషల్ మీడియాలో సర్వేలు వైరల్ అయ్యాయి. అయిన పట్టించుకోలేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా సర్వే లు వేసేసింది. పట్టించుకోలేదు. దాంతో…. నిషేధం లేదేమో అన్నట్లు అయిపోయింది పరిస్థితి. ఎన్నికల ఫలితాలు వస్తే వేసునట్లు, పోలింగ్ అయిపోయాక వేసే ఏక్సిట్ పోల్స్ తరహాలో మీడియా ఓటర్లను ప్రభావితం చేసేలా, ఆయా పార్టీలకు అనుకూలంగా ఉన్న మీడియా ఓటర్ల ను ప్రభావితం చేసింది.  అయినా చర్యలకు ఉపక్రమించలేదు. సుమోటోగా చర్యలకు ఆస్కారం ఉన్నా, పట్టించుకోవటం లేదన్న విమర్శలు వ్యక్త అవుతున్నాయి.

తొలిసారిగా జరుగుతున్న తెలంగాణ ఎన్నికల్లో…. రాష్ట్ర ఎన్నికల సంఘము పూర్తిస్థాయిలో తన విధులు నిర్వర్తించటంలో విఫలమైందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అయితే… ఇలాంటి చర్యలు అధికార పార్టీలకు మేలు చేస్తాయి అంటున్నారు విశ్లేషకులు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*