రేవంత్ అరెస్ట్, టీఆర్ఎస్ సెల్ఫ్ గోల్.

Read Time: 0 minutes

రేవంత్ రెడ్డి అరెస్ట్ తో కొడంగ‌ల్ లో ఇబ్బందిపెట్టొచ్చు అనుకున్న టీఆర్ఎస్ సెల్ప్ గోల్ చేసుకున్న‌ట్లు క‌న‌ప‌డుతోంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. రేవంత్ రెడ్డికి  అన‌వ‌స‌రంగా హైప్ ఇచ్చింద‌ని, నిన్న‌టి వ‌ర‌కు ఉన్న మైన‌స్ లు.. ఈ అరెస్ట్ పై సానుభూతితో మాయ‌మ‌యిపోతాయ‌ని అంచ‌నా వేస్తున్నారు రాజకీయ విశ్లేష‌కులు.

రేవంత్ ను అరెస్ట్ చేయ‌టం ద్వారా… అటు గ‌జ్వేల్ లో ర్యాలీ, రోడ్ షోకు వెళ్ల‌కుండా నిలువ‌రించ‌టంతో పాటు, ఇటు కొడంగ‌ల్ లో ఆయ‌న్ను రెండు రోజుల పాటు నిర్భందిస్తే… ప్ర‌చార స‌మ‌యం ముగుస్తుంద‌ని టీఆర్ఎస్ భావించింది. ఎలాగు.. రేవంత్ త‌న వాఖ్యల‌తో తానే దొరికిపోయాడు కాబ‌ట్టి, ఆ ప‌రిస్థితిని వాడుకోవాల‌ని టీఆర్ఎస్ తాప‌త్ర‌య ప‌డింది. కానీ కాంగ్రెస్ నేత‌లు చాక‌చ‌క్యంతో వ్య‌వ‌హ‌రించ‌టంతో… టీఆర్ఎస్ వ్యూహాలు బెడిసికొట్టాయి. ఎంత‌లా అంటే… ఆయ‌న‌కు ఉన్న మైన‌స్ ల‌ను క‌ప్పిపుచ్చుతూ, సానుబూతి వ‌చ్చేలా.

ఉద‌యం రేవంత్ అరెస్ట్ ద‌గ్గ‌ర నుండే హైడ్రామా మొద‌లైంది. ఆయ‌న్ను అరెస్ట్ చేయ‌టంతో… వేగంగా స్పందించిన కాంగ్రెస్ అధిష్టానం ఇటు ఈసీని, అటు డిల్లీలో కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని ఆశ్ర‌యించ‌టంతో పాటు, ఇటు హైకోర్టులో అర్జంటుగా కేసును విచారించాల‌ని కోరుతూ లంచ్ మోష‌న్ పిటిష‌న్ వేసింది. రేవంత్ ను స్టార్ క్యాంపెయిన్ గా గుర్తిస్తూ కాంగ్రెస్ గ‌తంలో ఈసీకి లెట‌ర్ ఇవ్వ‌టం ఇప్పుడు రేవంత్ కు క‌లిసి వ‌చ్చింది. కాంగ్రెస్ నేత‌లు ఈసీని క‌లిసి… స్టార్ క్యాంపెయిన‌ర్ హోదాలో ఉన్న వ్యక్తిని ప్ర‌చారం నిర్వ‌హించ‌కుండా అడ్డుకోకూడ‌ద‌ని వాదించ‌గా, ఈసీ వెంట‌నే స్పందించి డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. వెంట‌నే ఆయ‌న్ను విడిచిపెట్టింది. స్వ‌యంగా పోలీసులు ఇంటికి త‌ర‌లించారు. మ‌రోవైపు మ‌ద్యాహ్నం కోర్టు కూడా స్పందించింది. రేవంత్ ను ఆకార‌ణంగా అరెస్ట్ చేశార‌ని ప్ర‌భుత్వం పై సీరీయ‌స్ అయింది. అల్ల‌ర్లు జ‌రుగుతాయ‌ని ఇంట‌లిజెన్స్ రిపోర్ట్ ఉంద‌ని పోలీసులు చెప్ప‌టంతో… కాస్త స‌మ‌య‌మిచ్చి రిపోర్ట్ ఇవ్వ‌మ‌ని అడిగింది. కానీ పోలీసులు ఆ కాపీని అంద‌జేయ‌కపోవటంతో… ఇంత టెక్నాల‌జీలో కూడా ఇవ్వ‌లేరా అంటూ మండిప‌డింది. మ‌రోవైపు డీజీపీ, ఈసీ ఆదేశాల మేర‌కు విడుద‌ల చేయ‌బోతున్నామ‌ని కోర్టుకు తెలిపారు పోలీసులు.

దీన్నంతా… చూస్తే, ఈ రోజంతా రేవంత్ రెడ్డికి స‌రిప‌డా ప్ర‌చారం వ‌చ్చేసింద‌ని, కొన్ని మండ‌లాల్లో… మా నేత మావ‌ద్ద‌కు రాకున్నా ఎలా ఓటేస్తాం అంటూ రేవంత్ కు వ్య‌తిరేకంగా మాట్లాడిన ప్ర‌జ‌లు సైతం, ఇలా ఇబ్బంది పెడుతారా అన్న చ‌ర్చ‌కు దారి తీసింద‌ని రేవంత్ అనుచ‌రులంటున్నారు. మ‌రోవైపు బెడ్ రూం తలుపులు  ప‌గ‌ల‌గొట్టి లోప‌లికి వెళ్ల‌టం కూడా రాంగ్ సిగ్న‌ల్స్ పంపిన‌ట్ల‌యింద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ ప్ర‌భావం ఒక్క కొడంగ‌ల్ లోనే కాకుండా… యావ‌త్ రాష్ట్రం మొత్తం ఉంటుంద‌ని, ఓ ర‌కంగా చెడు చోయ‌బోయినా… త‌మ‌కు మంచే చేశారంటున్నారు కాంగ్రెస్ నేత‌లు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*