రేవంత్ కూ ఓట‌మి భ‌యం… అందుకే ఆ ఉలికి పాటు?

Read Time: 0 minutes

తెలంగాణ రాజ‌కీయాల్లో ఫైర్ బ్రాండ్ లీడ‌ర్ గా పేరుతెచ్చుకొని, నిత్యం వివాదాలు… ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌ల్లో మునిగితేలే కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి కొడంగ‌ల్ లో ఓట‌మి భ‌యం ప‌ట్టుకున్న‌ట్లు క‌న‌ప‌డుతోంది. అందుకే… రేవంత్ హంగామా మొద‌లుపెట్టాడ‌న్న ఆరోప‌ణ‌లూ మొద‌ల‌య్యాయి.

కొడంగ‌ల్ లో రేవంత్ ను ఓడించేందుకు టీఆర్ఎస్ పార్టీ పెద్ద ప్లానే వేసింది. ఓవైపు హ‌రీష్ రావు, మ‌రోవైపు కేటీఆర్ లు ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించి… అన్నీ ర‌కాలుగా బ‌ల‌మైన‌ ప‌ట్నం సోద‌రుల‌ను బ‌రిలోకి దించారు. మొద‌ట్లో… రేవంత్ కు ఇబ్బంది ఉండ‌దూ అని అంతా అనుకున్నా, గెలుపు పై రేవంత్ కు న‌మ్మ‌కం స‌న్న‌గిల్లిపోయింది. అందుకే ఇక త‌ప్ప‌దు అనుకున్న త‌ర్వాతే, రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌ను ప‌క్క‌న‌పెట్టేసి…. కొడంగ‌ల్ పైనే పూర్తిస్థాయిలో దృష్టిపెట్టారు. రేవంత్ త‌న ప్ర‌చారం కోసం హెలికాప్ట‌ర్ కూడా ఏర్పాటు చేసుకున్నా, స్థానిక ప‌రిస్థితులు అర్థం కావ‌టంతోనే… ప్రాణ‌హ‌నీ పేరిట కొడంగ‌ల్ కే ప‌రిమిత‌మయ్యారు.

అయితే… రేవంత్ ఆర్థిక మూలాల‌పై కూడా టీఆర్ఎస్ దృష్టిపెట్ట‌డంతో రేవంత్ రెడ్డి క‌ష్టాలు ఎక్కువ‌య్యాయ‌ని తెలుస్తోంది. ఓవైపు టీఆర్ఎస్ భారీగా ప్ర‌లోభాలు, మ‌రోవైపు రేవంత్ క‌ట్ట‌డితో కొడంగ‌ల్ రాజ‌కీయం పూర్తిగా మారిపోయంద‌ని తెలుస్తోంది. అందులో భాగంగానే… రేవంత్ కీల‌క అనుచ‌రులు, మండ‌లాల వారీగా నేత‌ల ఇండ్ల‌ను టార్గెట్ చేస్తున్నారు. అర్ధ‌రాత్రి సోదాలు, కీల‌క ప్రాంతాలు… నాయ‌కుల‌పై నిఘా కూడా పెరిగిపోయింద‌ని తెలుస్తోంది. అందుకే రేవంత్ వ‌ర్గం ఆందోళ‌న‌లో ప‌డిపోవ‌టంతోనే ఈ ఆర్ధ‌రాత్రి ధ‌ర్నాల‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. విధిలేని ప‌రిస్థితుల్లోనే రేవంత్ రోడ్డుపైకి వ‌చ్చార‌ని, కానీ కొడంగ‌ల్ లో రేవంత్ గ‌ట్టేక్కాలంటే సానుభూతి… సెంటిమెంట్ ఒక్క‌టే ఆధారం అని రేవంత్ వ‌ర్గం డిసైడ్ అయిపోయంది. అందుకే కొడంగ‌ల్ లోని ప్ర‌తి మండ‌లంలోని ప్ర‌తి ఊరుకు  రేవంత్ వెళ్తున్నార‌ని… గ‌తంలో పోని గ‌డ‌ప‌నూ ట‌చ్ చేస్తున్నార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇలా రేవంత్ ఒక్క‌డే కాదు, టీఆర్ఎస్ కొంత‌మందిని టార్గెట్ చేసింద‌ని… అందులో చాలా వ‌ర‌కు స‌క్సెస్ కాబోతుంద‌ని టీఆర్ఎస్ వ‌ర్గాలు ధీమాగా చెబుతున్నాయి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*