లక్ష దాటిన హ‌రీష్ రావు.

Read Time: 0 minutes

మా ల‌క్ష్యం ల‌క్ష‌. పైస‌లు కాదు…  మెజారిటీ. సిద్దిపేట‌లో ఎదురే లేకుండా దూసుక‌పోతున్న హ‌రీష్ రావుకు సిద్దిపేట ప్ర‌జ‌లు మ‌రోసారి బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఏకంగా ల‌క్ష్య మెజారిటీ ఇచ్చి, తిరుగులేని నాయ‌కున్ని తెలంగాణ రాజ‌కీయాల్లో విల‌క్ష‌ణ తీర్పునిచ్చారు.

నాకు పాస్ మార్కులు కాదు… నేను ప‌గ‌లు, రాత్రి అన‌క ప‌నిచేసినా. ఎక్క‌డ ఏ ప‌నిలో ఉన్నా… సిద్దిపేట కోస‌మే ఆలోచించా. సిద్దిపేట‌ను విడిచి పెట్టి, ఎన్నిక‌ల‌ప్పుడు రాలేదు. నేను బాగా ప‌నిచేశా అంటే, నాకు ల‌క్ష మెజారిటీ ఇవ్వండంటూ హ‌రీష్ చేసిన ప్ర‌చారాన్ని ప్ర‌జ‌లు పూర్తిగా అంగీక‌రించారు. అన్నా అన‌గానే నేనున్నా అంటూ వ‌చ్చే హ‌రీష్ రావు కు ఆ ఆప్యాయ‌తే తిరుగులేని నాయ‌కున్ని చేసింది. దేశంలో అత్యంత అరుదైన ఓక్క అసెంబ్లీ సెగ్మెంట్ లో ల‌క్ష మెజారిటీని దాటడం మాములు విష‌యం కాదు. ప్ర‌జా నేత‌లుగా పేరొందిన నేత‌లకు ఈ ఫీట్ సాధ్యం కాలేదు. త‌న రికార్డుల‌ను తానే బ‌ద్ద‌లు కొట్టుకొని, గ‌త ఎన్నిక‌ల్లో వ‌చ్చిన 93వేల పైచిలుకు మెజారిటీని బీట్ చేసి ల‌క్ష మెజారిటీ దాటారు హ‌రీష్ రావు. 2004లో చార్మినార్ నుండి ఎంఐఎం అబ్య‌ర్థికి ల‌క్షా ఏడు వేల మెజారిటీయే ఇప్ప‌టి వ‌ర‌కు అత్య‌ధికం. అలాంటిది హ‌రీష్ మెజారిటీ దాన్ని బీట్ చేసింది. దీంతో సిద్దిపేట‌లో ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు సంబ‌రాలు చేసుకుంటున్నారు. ల‌క్షే మా ల‌క్ష్యం అంటూ సిద్దిపేట యూత్ హ‌రీష్ రావు కోసం ప్ర‌త్యేకంగా ఉద్య‌మంలా కృషి చేశారు.

హ‌రీష్ రావు డైన‌మిక్ అని మ‌రోసారి నిరూపించుకున్నాడంటూ ఆయ‌న అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. అటు పార్టీలోనూ, ఇటు కేసీఆర్ ఎ ప‌ని అప్ప‌జెప్పినా పూర్తిస్థాయిలో ప‌నిచేసి, క‌ష్ట‌ప‌డే త‌త్వం హ‌రీష్ రావుద‌ని, సిద్దిపేట‌లోనూ అదే ప‌నితీరు ఆయ‌న్ను తిరుగులేని రికార్డుల రారాజుగా నిల‌బెట్టిందంటున్నారు హ‌రీష్ రావు అభిమానులు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*