ల‌గ‌డ‌పాటి స‌ర్వే… టీఆర్ఎస్ లో క‌ల‌వ‌రం

Read Time: 1 minutes

ల‌గ‌డ‌పాటి చేసిన స‌ర్వే టీఆర్ఎస్ కు వ్య‌తిరేకంగా ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించ‌బోతుందా…?  రెండు నెల‌ల క్రితం ప్ర‌త్యేకంగా కోరి మ‌రీ… స‌ర్వే చేయించుకున్న ల‌గ‌డ‌పాటి ప్లాష్ టీం పై టీఆర్ఎస్ ఇప్పుడెందుకు ఆరోప‌ణ‌లు చేస్తోంది…?  కేసీఆర్ కు వ్య‌తిరేకంగా ఆ స‌ర్వే రిపోర్టు ఉంద‌న్న వార్త నిజ‌మ‌నే విష‌యం తెలిసే… ఈ విమ‌ర్శ‌లా అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది.

ల‌గ‌డ‌పాటి స‌ర్వే ఓ బ‌క్వాస్ స‌ర్వే అని, ఆయ‌న టీడీపీ నేత‌ల‌తో క‌లిసి చేయించిన స‌ర్వే అంటూ మండిప‌డుతున్నారు. తెలంగాణ‌లో భారీగా స్వ‌తంత్ర స‌భ్యులు గెల‌వ‌బోతున్నార‌ని చెప్ప‌టం వెనుక టీడీపీ ఉంద‌ని మండిప‌డుతోంది. కాంగ్రెస్–టీడీపీ కి వార‌ధిగా ల‌గ‌డ‌పాటి ప‌నిచేస్తున్నాడ‌ని మండిప‌డ్డారు. గ‌తంలో… నిక్క‌చ్చిగా చేస్తార‌న్న ఉద్దేశంతోనే రెండు నెల‌ల క్రితం ల‌గ‌డ‌పాటిని ప్ర‌త్యేకంగా కోరి మ‌రీ… కేసీఆర్ స‌ర్వే చేయించారు. ఆ స‌ర్వేలో టీఆర్ఎస్ కు 90కిపైగా సీట్లు వ‌స్తాయ‌ని చెప్పారు. ఆ మ‌ద్య కేసీఆర్ స‌ర్వే రిపోర్టు చెబుతూ,  వారి వారి గ్రాఫ్ కాపీల‌ను కూడా ఎమ్మెల్యేల‌కు అంద‌జేశారు.

అంత‌లా న‌మ్మిన టీఆర్ఎస్ ఇప్పుడు… ల‌గ‌డ‌పాటి స‌ర్వేను ఎందుకు వ్య‌తిరేకిస్తుందో అందరికీ అర్థమ‌వుతోంది. మ‌హ‌కూట‌మి గ్రాఫ్ భారీగా పెరిగింద‌ని, ముఖ్యంగా రెబల్స్ ముఖ్య పాత్ర పోషిస్తార‌ని ల‌గ‌డ‌పాటి  చెప్ప‌టం… టీఆర్ఎస్ కు మింగుడు ప‌డ‌టం లేదు. అది టీఆర్ఎస్ పార్టీ పై తీవ్ర ప్ర‌భావాన్నే చూపుతోంది. 100కు పైగా సీట్ల‌ని కేసీఆర్ ప్ర‌చార స‌భ‌ల్లో చెప్తుంటే… ఎంతో న‌మ్మ‌కాన్ని సొంతం చేసుకున్న ఆంద్రా ఆక్టోప‌స్ ఇలా టైట్ ఫైట్ సిగ్న‌ల్ ఇవ్వ‌టం త‌మ‌కు న‌చ్చ‌లేదు. పైపెచ్చు లగ‌డ‌పాటి కొంత మంది నేత‌ల‌తో… వారి బ‌ల‌బాలాలు, ఎక్క‌డ ఇబ్బంది ఉందో కాంగ్రెస్, టీడీపీల పాత మిత్రుల‌కు ముందే చెప్పేయ‌టం, వారిని అల‌ర్ట్ చేయ‌టం కూడా టీఆర్ఎస్ జీర్ణించుకోలేక‌పోతుంద‌ని తెలుస్తోంది.

అందుకే… ఎలాగు తెలంగాణ వ్య‌తిరేకిగా ముద్ర‌ప‌డ్డ ల‌గ‌డ‌పాటికి చంద్ర‌బాబు అనుకూల ముద్ర వేయ‌టం ద్వారా, ఆ స‌ర్వే ఫ‌లితాలు తెలంగాణ ప్ర‌జ‌ల‌పై ప‌డ‌కుండా విమ‌ర్శ‌ల‌కు దిగుతోంది. అందుకే ఎంపీ వినోద్ రంగంలోకి దిగి, విమ‌ర్శ‌లు కురిపిస్తున్నార‌ని కూట‌మి నేత‌లు అంచ‌నా వేస్తున్నారు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*