వివాదాల శ్రీ‌శాంత్… మ‌ళ్లీ అదే గోల‌.

Read Time: 0 minutes

క్రికెట‌ర్ శ్రీ‌శాంత్… ఎంత త్వ‌ర‌గా ఫేమ‌స్ అయ్యాడో, అంతే త్వ‌ర‌గా దిగ‌జారిపోయాడు. నిత్యం వివాదాల‌తోనే ఉండే శ్రీ‌శాంత్, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోప‌ణ‌ల‌తో  త‌న కేరీర్ ను నాశ‌నం చేసుకున్నాడు. ఆ త‌ర్వాత పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చినా, వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌టంతో… బాలీవుడ్ లో నెట్టుకొస్తూ, ప్ర‌స్తుతానికి హీందీ బిగ్ బాస్ సీజ‌న్ 12లో ఉన్నాడు.

ఫుల్ పాపులారీటీ ఉన్న హీందీ బిగ్ బాస్ ఈ సారి ఎన్నో వివాదాల‌కు కేంద్ర‌బిందువైపోయింది. హౌజ్ లో ప‌రిస్థితి చూస్తుంటే… వామ్మో అంటున్నారు జ‌నం. ఈ హౌజ్ లో మెంబ‌ర్ గా ఉన్న శ్రీ‌శాంత్ చుట్టూనే ఏదో వివాదం నెల‌కొంటూనే ఉంది. తెలుగులో ఇటీవ‌ల ఎంతో ఫేమ‌స్ అయిన కౌష‌ల్ కు తాత‌లా ఉన్నాడంటూ జ‌నం సెటైర్స్ వేసే ప‌రిస్థితి వ‌చ్చేసింది. అయితే.. బిగ్ బాస్ హౌజ్ లో మ‌రో హౌజ్ మేట్ రానాతో గొడ‌వ‌కు దిగిన శ్రీ‌శాంత్… ఇద్ద‌రు ఒక‌రినొక‌రు దూషించుకునే వ‌ర‌కు వెళ్లింది ప‌రిస్థితి. రానా ఓ అడుగు ముందుకేసి… శ్రీ‌శాంత్ మ్యాచ్ ఫిక్సర్ అని, చీట‌ర్ అంటూ… వ్యంగ్యంగా మాట్లాడ‌టంతో… శ్రీ‌శాంత్ కోపంతో ఊగిపోయాడు. నువ్వేమీ మంచిదానివా… నువ్వో వ్య‌భిచారివి అంటూ సుర‌భి రానాను తిట్టిపోశాడు. దీంతో హౌజ్ మేట్స్ అంతా ఆశ్చ‌ర్యంతో… స్ట‌న్ అయిపోయారు. వెంట‌నే తేరుకున్న శ్రీ‌శాంత్ త‌ను కోపంలో ఎదో అనేశాన‌ని, త‌న‌ను క్ష‌మించ‌మ‌ని కోరాడు. అదే చిరాకులో… బాత్ రూంలోకి వెళ్లి, త‌ల‌ను గోడ‌కు కొట్టుకుని త‌న‌ను తాను గాయ‌ప‌ర్చుకున్నాడు. దాంతో శ్రీ‌శాంత్ గాయ‌ప‌డ‌టం, అక్క‌డి నిర్వాహ‌కులు హ‌స్పిటల్ కు త‌ర‌లించ‌టం వెంట వెంట‌నే జ‌రిగిపోయాయి.

అయితే… శ్రీ‌శాంత్ సేఫ్ గా ఉన్నాడ‌ని, బిగ్ బాస్ హౌజ్ కు కూడా చేరుకున్నాడ‌ని శ్రీ‌శాంత్ భార్య సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించింది.

అయితే… శ్రీ‌శాంత్ మాన‌సిక ప‌రిస్థితి స‌రిగ్గా లేద‌ని, ఆవేశంలో ఆయ‌న ఏం చేస్తారో ఆయ‌న‌కే తెలియ‌ద‌ని మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింద‌ని సోష‌ల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇక మ‌రికొంద‌రు ఓ అడుగు ముందుకేసి… హీందీ బిగ్ బాస్ సీజ‌న్ 12లో ఇంకా ఎన్ని వింత‌లు చూడాల్సి వ‌స్తుందో అంటూ పెద‌వి విరుస్తున్నారు

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*