స్పెయిన్ లో సొంత నివాసం కోసం ఎన్టీఆర్ భారీ బ‌డ్జేట్…?

Read Time: 1 minutes

బాలీవుడ్, హ‌లీవుడ్ సిని స్టార్స్ త‌ర‌హాలోనే… తెలుగు హీరోలు క్యూ క‌డుతున్నారు. దేశ, విదేశాల్లో వ్యాపారాలు, స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇంత‌వ‌ర‌కు తెలుగు హీరోలు  పెద్దగా ఆస‌క్తి చూప‌కున్నా, ఇందుకు ఎన్టీఆర్ నాంది ప‌లక‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

సెలబ్రిటీలు… షూటింగ్ ల కోసం, ఫ్యామిలీ–ఫ్రెండ్స్ కోసం  విదేశాల‌కు వెళ్ల‌టం, ఎంజాయ్ చేయ‌టం కామ‌న్. అయితే… స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు పెద్ద‌గా ఇంట్ర‌స్ట్ చూప‌రు. కానీ నంద‌మూరి వార‌సుడు, ఎన్టీఆర్ స్పెయిన్ లో ఓ విల్లా కొనుగోలు చేశాడ‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే అక్క‌డ రామ్ చ‌ర‌ణ్, ఉపాస‌న‌ల‌కు ప‌లు బిజినెస్ లు ఉండ‌గా, అక్క‌డ తానూ… స్థిర నివాసం కోసం చాలా రోజులుగా ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట ఎన్టీఆర్. గ‌తంలో బాద్ షా సినిమా షూటింగ్ లో భాగంగా స్పెయిన్ వెళ్లిన ఎన్టీఆర్ కు ఆ ప్లేస్ ఎంతో న‌చ్చేయ‌టం, త‌నకు మంచి మిత్రుడిగా ద‌గ్గ‌ర‌యిన రామ్ చ‌ర‌ణ్ కూడా స‌ల‌హ ఇవ్వ‌టంతో అందుకు ఓకే చెప్పేశాడ‌ట ఎన్టీఆర్.

ఎన్టీయార్ త‌న కుటుంబంతో క‌లిసి… వెకేష‌న్ కోసం రావడానికి, షూటింగ్ టైమ్స్ లో విశ్రాంతి కోసం స్పెయిన్ కే వెళ్లాల‌ని నిర్ఱ‌యించుకోవ‌టంతో… స్పెయిన్ లోనే విల్లా తీసుకోవాలని డిసైడ్ అయ్యార‌ని ఆయ‌న సన్నిహితులు చెబుతున్నారు. అయితే… ఇందులో త‌న అన్న‌య్య‌, క‌ళ్యాణ్ రామ‌కు కూడా వాటా ఉండ‌బోతుంద‌ని తెలుస్తోంది. ఈ మ‌ద్య ఎలాంటి ప‌నులు మొద‌లుపెట్టినా… ఇద్ద‌రు క‌లిసే చేస్తున్నారంటోంది సీనీ ఇండస్ట్రీ.

అయితే… ఈ విల్లా కోసం… నంద‌మూరి వార‌సులు ఎంత పెట్టుబ‌డి పెట్టబోతున్నారంటే… మాత్రం కండ్లు తిరిగిపోతాయి. ఈ విల్లా కోసం 1.5 మిలియన్ డాలర్ల వ‌ర‌కైనా ఓకే అనుకున్నార‌ట‌. కొంత కాలంగా…  స్పెయిన్ లో స్థిర నివాసాల కోసం, వ్యాపారాల కోసం… బ‌య‌టి దేశ‌స్థుల‌కు అక్క‌డి ప్ర‌బుత్వం అన్ని ర‌కాల స‌దుపాయాలు, ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తోంది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*