స‌త్యం కంప్యూట‌ర్స్ మ‌ళ్లీ సీన్ లోకి…. ఇప్పుడు కేటీఆర్ కేంద్రంగా.

Read Time: 0 minutes

అదేంటి… అప్పుడెప్పుడో దివాళ తీసి, జ‌నాన్ని… వారి వారి న‌మ్మ‌కాల‌ను నిలువునా ముంచి… ఎంద‌రికో తీర‌ని అన్యాయాన్ని చేసిన స‌త్యం పేరు మ‌ళ్లీ ఎందుకు తెర‌పైకి వ‌చ్చింది, పైగా కేటీఆర్ కేంద్రంగా అనుకుంటున్నారా…. నిజ‌మే కానీ, తండ్రికి త‌గ్గ త‌న‌యుడిలా… స‌త్యం కంప్యూట‌ర్స్ అధినేత రామ‌లింగ రాజు కుమారుడి స‌హ‌యంతో కేటీఆర్ అక్ర‌మ సంపాద‌న దేశాలు దాటిస్తున్నార‌ట‌. అంటే… స‌త్యం కంప్యూట‌ర్స్ అధినేత కొడుకు దొంగ‌ల‌కు స‌ద్ది క‌డుతున్నాడ‌న్న మాట‌. కేటీఆర్ అవినీతి, అక్ర‌మ సంపాద‌న‌పై కాంగ్రెస్ నేత‌ల ఆరోప‌ణ‌లు ఇవి.

కేసీఆర్… ద‌రిద్ర‌పు గొట్టు కేసీఆర్… నీ అక్ర‌మ ఆస్తుల చిట్టా మా వ‌ద్ద ఉంది. జ‌య‌శంక‌ర్ సార్ ఇంట్లో చ‌ర్చ‌కు కూర్చుందామా… కొండా ల‌క్ష్మ‌ణ బాపూజీ సార్ ఇంట్లో చ‌ర్చిద్దామా అంటూ మాజీ ఎంపీ మ‌ధుయాష్కీ కేసీఆర్, ఆయ‌న కుటుంబ ఆస్తుల‌పై ఫైర్ అయ్యారు.  కేసీఆర్ తో పాటు ఆయన కొడుకు, కూతురు, మేనళ్లుడు కాంట్రాక్టర్లు, సినీ నిర్మాతలు, పారిశ్రామిక వేత్తలను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారని, అందుకే… ఎ బిజినెస్ మ్యాన్ కు పెర‌గ‌ని త‌ర‌హాలో వీరి ఆస్తులు ఎన్నో రేట్లు పెరిగాయ‌ని మ‌ధుయాష్కీ ఆరోపించారు. ఇలా దోచుకున్న డబ్బులను విదేశాలకు తరలించడానికి కేసీఆర్ కు సత్యం రామలింగ రాజు తనయుడు సత్యం తేజ్ రాజ్ సహాయం చేస్తున్నాడంటూ మధుయాష్కి ఆరోపించారు.

సత్యం కుంభకోణంలో ప్రముఖ పాత్ర వహించిన రామలింగరాజు కొడుకు తేజ్ రాజ్ మంత్రి కేటీఆర్ విదేశాల్లో దిగిన ఫోటోలను యాష్కి బైటపెట్టారు. కేసీఆర్ సంపాదించిన నల్లధనాన్ని విదేశాలను తరలించడంతో పాటు వాటి లావాదేవీలు చూసే బాధ్యతను తేజ్ రాజ్ తీసుకున్నాడని పేర్కొన్నారు. అందువల్లే కేటీఆర్ విదేశీ పర్యటనలకు వెళ్లిన ప్రతిసారి ఆయన వెంట తేజ్ రాజ్ ఉంటాడని, మ‌రీ ముఖ్యంగా మలేసియాకు కేసీఆర్, కేటీఆర్ లు తమ అక్రమ సంపాదనను తరలిస్తున్నారని, అక్క‌డి నుండే అమెరికా స‌హా ఇతర విదేశాల‌కు ఆ సోమ్ము చేరుకుంటుంద‌ని  యాష్కి  కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. అందుకు సంబందించిన అన్ని ఆధారాలు త‌మ వ‌ద్ద ఉన్నాయ‌ని, రేపో మాపో ఎంపీ క‌విత బండారం కూడా బ‌య‌ట‌పెడుతామ‌ని తెలిపారు. క‌విత‌కు బెంగుళూరు డాల‌ర్ కాలనీలో విల్లా ఎలా వచ్చిందో చెప్పాల‌ని… లేదంటే నేనే చెప్తా అంటూ హెచ్చరించారు.

రోజుకో నేత‌… అక్ర‌మ ఆస్తుల బండారం ప్ర‌జ‌ల ముందు ఉంచ‌బోతున్న‌ట్లు తెలిపారు మ‌ధుయాష్కీ. కాగా… ఇప్ప‌టికే కేసీఆర్ అవినీతి కేసుల‌పై పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కూడా మీడియా ముందు కొన్ని ఆధారాలు బ‌య‌ట‌పెట్టారు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*