హైద‌రాబాద్ లో మ‌హేష్ బాబు మ‌ల్టిప్లెక్స్, వ‌ర్మ కామెంట్స్.

Read Time: 1 minutes

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు మ‌రో బిజినెస్ లోకి అడుగుపెట్టారు. ఐటీ అడ్డా గ‌చ్చిబౌలీలో తాజాగా ఓపెన్ అయిన ఏఏంబీ మాల్ మ‌హేష్ వాటా కూడా ఉంద‌ని తెలుస్తోంది. అత్యాధునిక హంగుల‌తో, ఇప్ప‌టి వ‌ర‌కు సౌత్ ఇండియాలోనే లేని హంగులు… టెక్నాల‌జీతో ది బెస్ట్ మ‌ల్టిప్లెక్స్ గా డిజైన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే అప్పుడే దీనిపై వ‌ర్మ త‌న‌దైన శైలీలో ఓ కామెంట్ కూడా వేశాడు.

మొత్తం ఏడు స్క్రీన్స్…  1,600 మంది సీటింగ్ కెపాసిటీతో… కొత్త మ‌ల్టిప్లెక్స్ ప్రారంబ‌మైంది.  సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు–కృష్ణ‌ల చేతుల మీదుగా ఈ మ‌ల్టిప్లెక్స్ అందుబాటులోకి రాగా.. ఫ‌స్ట్ పిల్మ్ రోబో 2.0 ప్ర‌ద‌ర్శిస్తున్నారు. అయితే… ఈ మ‌ల్టిప్లెక్స్ లో ఏషీయ‌న్ థియేట‌ర్స్ టైఅప్ అయిన‌ట్లు తెలుస్తోంది. అయితే…  ఈ మ‌ల్టిప్లెక్స్ లో ఉన్న  సీటింగ్ 7 స్క్రీన్స్ లో 2 మాత్ర‌మే మ‌హేష్ వ‌న్న ప్ర‌చారం వినిపిస్తోంది. మొత్తం న‌లుగురు వాటాల‌తో ఈ మ‌ల్టిప్లెక్స్ మొద‌లుప‌ట్టిన‌ట్లు తెలుస్తోంది. ఇందులో షేర్ తో పాటు, ఏఏంబీ మ‌ల్టిప్లెక్స్ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా కూడా మ‌హేష్ త‌న  బ్రాండ్ ను త‌నే ప్ర‌మోట్ చేసుకోతున్నార‌ట‌. అయితే… ఇక్క‌డ స‌క్సెస్ రేటును బ‌ట్టి, వ‌స్తున్న ఆద‌ర‌ణ‌… రెస్పాన్స్ ను బ‌ట్టి హైద‌రాబాద్ న‌లుమూల‌ల ఏఏంబీ మ‌ల్టిప్లెక్స్ లు మొద‌లుపెట్టే ఆలోచ‌న కూడా ఉంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఆంద్రాలో కూడా విజ‌య‌వాడ‌, అమ‌రావ‌తిల‌లో ఏఏంబీ మ‌ల్టిప్లెక్స్ ల కోసం నిర్మాణాలు జ‌రుగుత‌న్నాయ‌ని తెలుస్తోంది. తొలి మ‌ల్టిప్లెక్స్ లో మ‌హేష్ తో పాటు ఏపీ ఏంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ కూడా అటెండ్ అయ్యారు.

అయితే… ఈ ఏఏంబీ పై సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు వ‌ర్మ త‌న‌దైన శైలీలో ఆరోప‌ణ‌లు గుప్పించారు. మొద‌టి రోజే సినిమా చూసిన వ‌ర్మ‌, త‌న కామెంట్ ను ప్రేక్ష‌కుల‌తో పంచుకున్నాడు. మ‌హేష్ ఏఏంబీలో ఫ‌స్ట్ మూవీ చూశా. ఈ థియేట‌ర్ లో ఒక్క ప్రాబ్ల‌మ్ ఉంది. విజువ‌ల్ వండ‌ర్, సౌండ్స్ అద్బుతంగా ఉన్నాయి… కానీ ఇంకా ఇలాంటి థియేట‌ర్ లో వేసే సినిమా ఇంకా రాలేదు. అదొక్క‌టే ఏఏంబీలో ప్రాబ్ల‌మ్ అంటూ… త‌న‌దైన శైలీలో ప్ర‌చార క‌ర్త‌గా మారిపోయారు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*