హ‌న్సిక రామ్ డేటింగ్….?

Read Time: 1 minutes

తెలుగులో ఫేడ్ అవుట‌యిన… హీరోయిన్ హ‌న్సిక, టాలీవుడ్ స్టార్ హీరో రామ్ డేటింగ్ లో ఉన్నారా…? అంటే అవున‌నే అంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు. మంచి అందం ఉన్నా, తెలుగులో తొంద‌ర‌గానే అవ‌కాశాలు కోల్పోయిన ఈ అమ్మ‌డుపై ఈ ప్ర‌చారం జోరుగానే ఉంది. కందిరీగ‌, మ‌స్కా సినిమాల్లో ఈ జోడి తెలుగులో ఆడిపాడింది.

అయితే… రామ్ పై ఇంత‌వ‌ర‌కు ఇలాంటి గాసిప్స్ గానీ, ఆఫ్ బీట్ స్టోరీస్ గానీ రాలేదు. సినిమా షూటింగ్ అంటే… షూటింగే. ఆ త‌ర్వాత ఎక్క‌డా పెద్ద‌గా క‌న‌ప‌డ్డ దాఖలాలు ఉంవు. అయితే హ‌న్సిక‌కు మాత్రం… కోలీవుడ్ ఇండ‌స్ట్రీలో ప్రేమాయ‌ణాలు కొత్తేం కాదు. అందుకే హ‌న్సిక కేరీర్ పూర్తిగా కోలీవుడ్ లోనే న‌డుస్తోంది. అయితే… హ‌న్సిక త‌న కోలీవుడ్ ఇండ‌స్ట్రీ ఫ్రెండ్స్ తో క‌లిసి… ఓపార్టీ ప్లాన్ చేసింద‌ని తెలుస్తోంది.  ఆ పార్టీలో జ‌రిగిన సంఘ‌ట‌న‌లను, హ‌న్సిక మాట‌ల‌ను బ‌ట్టి… హీరో రామ్ తో డేటింగ్ లో ఉన్న‌ట్లు హ‌న్సిక ఓపేన్ అయిన‌ట్లు ఆ పార్టీ లో తారలు చెప్పుకొంటున్నారు. ఈ మ‌ద్య వీరిద్ద‌రు విదేశీ టూర్ల‌కు కూడా వెళ్లార‌ని… రామ్ విష‌యంలో న‌మ్మ‌లేకుంటానే ఉన్నా, హ‌న్సిక మాత్రం కాన్ఫిడేంట్ గా… వారిద్ద‌రి మ‌ద్య విశేషాల‌ను బ‌య‌ట‌పెట్టుకుంద‌ని తెలుస్తోంది.

రామ్–హ‌న్సిక మీటింగ్స్ అన్నీ హ‌న్సిక‌నే ప్లాన్ చేస్తోంద‌ట‌. ఎదో రెగ్యూల‌ర్ గా క‌లిసిన‌ట్లు కాకుండా… స్పెష‌ల్ గా ప్లాన్ చేసుకుంటార‌ట ఈ ఇద్ద‌రు. అంతే కాదు… ఈమ‌ద్య కేవ‌లం సీనీ తార‌ల‌కు సంబందించిన ఓ లిమిటెడ్ పీపుల్ పార్టీలోనూ రామ్–హ‌న్సిక క‌లిసే వ‌చ్చి, ఒక‌రినొక‌రు వ‌ద‌ల‌కుండా… క్లోజ్ గా ఉన్నార‌ట‌. ఆ త‌ర్వాత‌… వీరిద్ద‌రి మ‌ద్య సంబందం నిజ‌మేనంటున్నారు సిని ప్ర‌ముఖులు.

అయితే… దీనిపై రామ్ గానీ, హ‌న్సిక గానీ ఎక్క‌డా బ‌య‌ట‌ప‌డ‌కున్నా, హ‌న్సిక ఈ కొత్త బంధం చివ‌రి వ‌ర‌కు అయినా ఉంటుందో లేక ఎప్ప‌టిలాగే… మ‌ద్య‌లోనే పుల్ స్టాప్ ప‌డుతుందో చూడాలి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*